తెజస వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం సహా ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని కోదండరామ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
కోదండరాం, తెజస పార్టీ నేతల అరెస్ట్ - inter issue
తెజస పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఇంటర్ బోర్డు వరకు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని కోదండరాం, కార్యకర్తలు బయలు దేరారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
కోదండరాం, తెజస పార్టీ నేతల అరెస్ట్