తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూ భూములపై గవర్నర్​ను కలిసిన కోదండరాం, చాడ

ఉస్మానియా విశ్వవిద్యాలయ భూములు పరిరక్షించాలని తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కోరారు. ఈ మేరకు గవర్నర్​కు వినతి పత్రం అందించారు.

kodandaram and chada venkat reddy met with governer on ou land issue in hyderabad
గవర్నర్​ను కలిసిన చాడ, కోదండరాం

By

Published : Jun 5, 2020, 7:49 PM IST

అక్రమణలకు గురవుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను పరిరక్షించాలంటూ తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కలిసి వినతిపత్రం ఇచ్చారు. నేతలు ఓయూ భూముల పరిరక్షణకు గట్టి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఉస్మానియా తెలంగాణ విద్యావికాసానికే కాదు మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని అనేక మంది పిల్లలకు విద్యానందిస్తూ కీలకపాత్ర పోషిస్తోందని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోకపోతే మొత్తం విశ్వవిద్యాలయం భూమి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గవర్నర్​ను కలిసిన చాడ, కోదండరాం

అనేక ఉద్యమాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలకపాత్ర పోషించిందని.. అలాంటి యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. డీడీకాలనీ ప్రాంతంలో ప్రహారీ లేకపోవడం వల్ల భూమి అక్రమణలకు గురవుతుందని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే మొత్తం అన్యాక్రాంతమయ్యే ప్రమాదముందన్నారు.

గవర్నర్​ను కలిసిన చాడ, కోదండరాం

ABOUT THE AUTHOR

...view details