లాక్‌డౌన్ వేళ ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. అకాల వర్షాలకు ధాన్యం తడసి రైతులు ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవటం లేదన్నారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
'కొనుగోలు కేంద్రాల వద్ధ రైతుల కష్టాలు కనిపించట్లేదా?' - తెలంగాణ వార్తలు
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆరోపించారు. అకాల వర్షాలకు అన్నదాతలు నష్టపోతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ అలసత్వం కారణంగా అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల సంఖ్యను ప్రభుత్వం తగ్గించడంతో పాటు బార్థాన్, హామాలీలు, లారీలు లేకపోవడంతో ధాన్యం కొనుగోలులో జాప్యం జరగుతోందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ధ రైతులు పడుతున్న కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన దానితో పాటు మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:కల్లాల్లో ధాన్యం.. రైతుల కళ్లల్లో దైన్యం