Kodanda Reddy on Dharani in Telangana: ప్రక్షాళన పేరుతో గత ప్రభుత్వం అనేక సమస్యలను తెచ్చి పెట్టిందని ధరణి కమిటీ సభ్యుడు, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. సచివాలయంలో ఇవాళ సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ అధ్యక్షతన ధరణి పోర్టల్అధ్యయన కమిటీ సమావేశం జరిగింది. తదుపరి మీటింగ్‌ను ఈనెల 22కి వాయిదా వేసింది. ధరణి పేరుతో లక్షలాది ఎకరాల రైతుల భూమి మాయమైందని కోదండరెడ్డి పేర్కొన్నారు. ధరణి సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వేగంగా స్పందించి కమిటీ వేశారన్నారు. ధరణి సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని కోదండరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని వివరించారు.
ధరణి అవకవతవకలపై కమిటీ - పోర్టల్ పునర్నిర్మాణ బాధ్యతల అప్పగింత
Telangana Government Committee on Dharani Portal : గత ప్రభుత్వాల భూమి రికార్డులు అన్ని విషయాలు సేకరించి పరిశీలిస్తున్నామని కోదండరెడ్డి అన్నారు. సోమవారం మరోసారి కమిటీ సభ్యులు సమావేశమై(Next Meeting of Dharani Committee in Telangana) ప్రజల ముందు ధరణిలో ఉన్న లోపాలను చూపిస్తామని అన్నారు. దానితో పాటు సీసీఎల్ఓ కార్యాలయంలో తమ కార్యచరణను రైతాంగానికి వివరిస్తామని తెలిపారు. ఈ నెల 11న ధరణి పోర్టల్ పూర్తి వివరాలతో క్లుప్తంగా సమస్యలను, కార్యచరణను చెబుతామని అంతవరకు వేచి ఉండాలని చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని ఏమి లేదని హామీ ఇచ్చారు.