తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా తీరు మార్చుకోవాలి :కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి - FAIR

భాజపాకు అనుకూలంగా లేని వారిపై సీబీఐతో దాడులు చేయించి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు ఆర్థిక నేరస్థులైన వారు ఇప్పుడు పార్టీ తీర్థం పుచ్చుకోగానే పునీతులయ్యారని పేర్కొన్నారు.

భాజపా తీరు మార్చుకోవాలి :కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి

By

Published : Aug 9, 2019, 10:21 PM IST

భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేని వారిపై కేంద్రం సీబీఐని ఉసిగొలుపుతోందని తెలంగాణ రాష్ట్ర పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కోదండ రెడ్డి ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత అధికార దుర్వినియోగం పెరిగిందని ద్వజమెత్తారు. ఎంపీలు సీఎం రమేష్‌, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్​, గరికపాటిలు భయపడే భాజపాలో చేరారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఆర్థిక నేరస్థులైన ఆ నలుగురు ఇప్పుడు పునీతులయ్యారని ఎద్దేవా చేశారు.

భాజపా తీరు మార్చుకోవాలి :కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details