లాక్ డౌన్ వల్ల సతమతమవుతున్న వారిని పలువురు దాతలు ఆదుకుంటున్నారు. తినడానికి తిండి దొరకని వారి పట్ల ఉదారత చూపుతూ మానవత్వం చాటుకుంటున్నారు. కేకేఎం ట్రస్ట్ ఛైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని 100 మంది జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, స్థానికులకు నిత్యావసర సరుకులు అందించారు.
కేకేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ - KKM Trust distributes essentials
కరోనా నేపథ్యంలో కేకేఎం ట్రస్ట్ మానవత్వాన్ని చాటుకుంటుంది. పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు నిత్యావసరాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తోంది.
![కేకేఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ KKM Trust distributes essentials in Jagadgirigutta Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:07:58:1622770678-tg-hyd-55-03-nityavasaralupampini-av-ts10011-03062021182740-0306f-1622725060-1027.jpg)
KKM Trust distributes essentials in Jagadgirigutta Hyderabad
మధ్యాహ్న భోజనం పెట్టి వారి ఆకలి తీర్చారు. రోజుకో డివిజన్ చొప్పున పారిశుద్ధ్య కార్మికులతో పాటు నిరుపేదలకు వీటిని అందిస్తున్నట్లు శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.