రాజ్యసభకు కేకే, సురేశ్ రెడ్డి ఏకగ్రీవం - రాజ్యసభకు కేకే, కేఆర్ సురేశ్ రెడ్డి ఏకగ్రీవం
15:48 March 18
రాజ్యసభకు కేకే, సురేశ్ రెడ్డి ఏకగ్రీవం
రాజ్యసభ సభ్యులుగా తెరాస నేతలు కె.కేశవరావు, కేఆర్ సురేశ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు స్థానాలకు జరిగిన ఎన్నికలకు కేకే, సురేశ్ రెడ్డితో పాటు శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజ్ రాజ్ కోయల్కర్ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రతిపాదకులు లేకపోవడం వల్ల జాజుల భాస్కర్, భోజ్ రాజ్‌ల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం వల్ల.. కేకే, సురేశ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నరసింహాచార్యులు నుంచి ఎన్నిక ధ్రువ పత్రాలను అందుకున్నారు. మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితులు హాజరై కేకే, సురేశ్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా రాజ్యసభలో గళం విప్పుతామని కేకే, సురేశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:పదికి సన్నద్ధం... కరోనా నేపథ్యంలో అప్రమత్తం