రాజ్యసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు కే కేశవరావు, కేఆర్ సురేశ్ రెడ్డి నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం11 గంటలకు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు సమర్పించనున్నారు. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. తెరాసకు సంపూర్ణ బలం ఉన్నందున.. ఇద్దరు నేతల ఎన్నిక ఏకగ్రీవం లాంఛన ప్రాయమే. ఈనెల 18న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత.. ఎన్నిక ప్రకటించనున్నారు. రాజ్యసభ అభ్యర్థిత్వం కోసం సుమారు డజనుకు పైగా నేతల పేర్లు వినిపించినప్పటికీ... వివిధ సమీకరణాల అనంతరం కేకే, సురేశ్‌రెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు.
నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న కేకే, సురేశ్‌రెడ్డి - రాజ్యసభకు కేకే, సురేశ్‌రెడ్డి
రాజ్యసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు కేశవరావు, సురేశ్‌రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు సమర్పించనున్నారు.
నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న కేకే, సురేశ్‌రెడ్డి