గతంలో కశ్మీర్‌తో సహా భాజపా ప్రతిపాదించిన పలు బిల్లులకు మద్దతిస్తూ ఓటేశామని.. కానీ ఇప్పుడు సీఏఏను వ్యతిరేకించామని.. భవిష్యత్తులోనూ ఖండిస్తామని కె.కేశవరావు రాజ్యసభలో అన్నారు. గిన్నె నిండా పాలు నింపి.. అందులో ఓ విషపు చుక్క వేసినట్లు భాజపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేకే పేర్కొన్నారు. కమలం పార్టీపై ప్రజలకున్న నమ్మకం పోయిందని ఆయన ఆరోపించారు.
సీఏఏను ఎప్పటికీ వ్యతిరేకిస్తాం: కె.కేశవరావు - kk about caa news
భాజపా చట్టబద్ధమైన బిల్లును ప్రతిపాదిస్తే మేము తప్పక మద్దతిస్తాం కానీ మత విద్వేషాలను రెచ్చగొట్టే చట్టాలను వ్యతిరేకిస్తామని రాజ్యసభ సభ్యుడు కేకే రాజ్యసభలో పేర్కొన్నారు.
సీఏఏను ఎప్పుడూ వ్యతిరేకిస్తాం: కే. కేశవరావు