తెలంగాణ

telangana

ETV Bharat / state

Kitex and Sintex Companies Invests in Telangana : రాష్ట్రానికి మరో రెండు కొత్త పరిశ్రమలు.. 1200 వేల మందికి ఉపాధి

Kitex and Sintex Companies Invests in Telangana : రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రెండు పరిశ్రమల తయారీ యూనిట్లకు శంకుస్థాపన చేశారు. రూ.1200 కోట్ల పెట్టుబడితో కిటెక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ ఫైబర్ టు అపారెల్ తయారీ క్లస్టర్​కు, రూ.350 కోట్ల వ్యయంతో సింటెక్స్ ఆధ్వర్యంలో పైపులు, వాటర్ ట్యాంకుల తయారీ యూనిట్​కు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రాజెక్టులతో 12 వేల మందికి ఉపాధి లభించే అవకాశముంది.

Kitex Group invests in Telangana
Kitex New Apparel Cluster in Rangareddy

By ETV Bharat Telangana Team

Published : Sep 28, 2023, 9:14 PM IST

Kitex New Apparel Cluster in Rangareddy రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ రూ.350 కోట్లతో పెట్టుబడితో సింటెక్స్ సంస్థ

Kitex and Sintex Companies Invests in Telangana :గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిశ్రమల తయారీ యూనిట్లు(Industries Manufacturing Units) రాష్ట్రానికి వస్తున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) గొప్పతనమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మరో రెండు పరిశ్రమల తయారీ యూనిట్లకు శంకుస్థాపన చేశారు.

Kitex Group invests 1200 Crore in Telangana :రూ.1200 కోట్ల పెట్టుబడితో కిటెక్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ ఫైబర్ టు అపారెల్ తయారీ క్లస్టర్​కు, రూ.350 కోట్ల వ్యయంతో సింటెక్స్ ఆధ్వర్యంలో పైపులు, వాటర్ ట్యాంకుల తయారీ యూనిట్​కు శంకుస్థాపన జరిగింది. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్​లో రోజుకు ఏడు లక్షల దుస్తుల తయారీ సామర్థ్యంతో కిటెక్స్ క్లస్టర్(Kitex Cluster) ఏర్పాటు కానుంది. 250 ఎకరాల విస్తీర్ణంలోని ఈ క్లస్టర్ ద్వారా 11 వేలకు మందికి పైగా ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అందులో 80 శాతం మందికి పైగా మహిళలే ఉపాధి పొందనున్నారు.

Sintex Company 350 Crore Manufacturing unit in Telangana : 2024 డిసెంబర్ నాటికి మొత్తం రూ.1200 కోట్ల వ్యయంతో క్లస్టర్ అభివృద్ధి చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా చందనవెల్లి పారిశ్రామిక పార్కులో రూ.350 కోట్ల పెట్టుబడితో సింటెక్స్ సంస్థ వాటర్ ట్యాంకులు, పీవీసీ పైపుల తయారీ(PVC Pipes Manufacture) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వివిధ రకాల పీవీసీ పైపులు, ఫిట్టింగ్స్ తయారీ(Fittings Manufacture) కోసం రానున్న మూడేళ్లలో కంపెనీ పెట్టుబడి పెట్టనుంది.

Lulu Mall Opening in Hyderabad : హైదరాబాద్​కు 'లులు మాల్‌' వచ్చేసింది.. ఎంత పెద్దగా ఉందో చూశారా..?

Sintex Company Will Invest in Telangana :వెల్​స్పన్ సంస్థ(Welspun Company) ఆధ్వర్యంలో సింటెక్స్ తయారీ యూనిట్ ఏర్పాటును స్వాగతించినమంత్రి కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు వెల్​స్పన్ సంస్థను కొత్త యూనిట్ ప్రారంభించేలా చేశాయని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, పరిశ్రమల విస్తరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. స్థానిక ప్రజలకు దానిపై అవగాహన లేకుంటే.. స్కిల్ డెవలప్​మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి కొంతకాలం వాళ్ల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ కంపెనీలో పని కల్పించడానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

Kitex Group Invests in Telangana : రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నామన్న వెల్​స్పన్ ఛైర్మన్ బీకే గోయెంకా.. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ప్రత్యేక విలువ ఇస్తామని అన్నారు. కొత్త యూనిట్​లో రాష్ట్రంలో మరింత మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, వెల్​స్పన్ గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ బీకే గోయెంకా, మంత్రి మహేందర్​ రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్​ రెడ్డి, చేవెళ్ల స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, రంగారెడ్డి జిల్లా ఛైర్​పర్సన్ అనితరెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

KTR Invited To Borlaug Dialogue 2023 : మరో అంతర్జాతీయ సదస్సు నుంచి మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం.. ప్రపంచానికి 'తెలంగాణ సాగు పాఠాలు'

Tabreed Company to Invest in Telangana : హైదరాబాద్​లో ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్​​ కూలింగ్ సిస్టమ్..పెట్టుబడి విలువ రూ.1600కోట్లు ​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details