తెలంగాణ

telangana

ETV Bharat / state

జనవరి 13 నుంచి ఘనంగా కైట్​, స్వీట్​ ఫెస్టివల్ - జనవరి 13 నుంచి ఘనంగా కైట్​, స్వీట్​ ఫెస్టివల్

ఓ వైపు దేశవిదేశాల నుంచి వచ్చిన పతంగులు ఎగురుతుంటే... మరోవైపు నోరూరించే ఎన్నో రకాల మిఠాయిలు... ఈ సంబురం హైదరాబాద్​లో జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ పండుగను ఘనంగా నిర్వహించాలని అధికారులను మంత్రి శ్రీనివాస్​ గౌడ్​​ ఆదేశించారు.

KITE, SWEET FESTIVAL START FROM JANUARY 20 IN HYDERABAD
KITE, SWEET FESTIVAL START FROM JANUARY 20 IN HYDERABAD

By

Published : Dec 28, 2019, 10:23 PM IST

హైదరాబాద్​లో వచ్చే నెల 13 నుంచి మూడు రోజులపాటు అంతర్జాతీయ గాలిపటాలు, మిఠాయిల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. పర్యాటకశాఖ అధికారులు, స్వీట్ ఫెస్టివల్ నిర్వాహకులు, కైట్‌ ప్లేయర్స్‌ సమన్వయకర్తలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగర బ్రాండ్‌ ఇమేజ్ మరింత పెరిగేలా ఉత్సవాలు ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

కైట్​, స్వీట్​కు తోడు ఎంటర్​టైన్​మెంట్​​...

కైట్ ఫెస్టివల్​కు ప్రపంచంలోని వివిధ దేశాలలో గుర్తింపు ఉన్న క్లబ్‌లను ఆహ్వానించి పాల్గొనేలా ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ దేశాల స్వీట్​ వెరైటీలను ప్రదర్శనలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కైట్‌ అండ్ స్వీట్ ఫెస్టివల్​ను రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మూడు రోజుల పాటు సాగనున్న పండుగలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు నిర్వహించాలని మంత్రి వివరించారు.

జనవరి 13 నుంచి ఘనంగా కైట్​, స్వీట్​ ఫెస్టివల్

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details