జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తార్నాక డివిజన్ లాలాపేటలో పర్యటించారు. భాజపా అభ్యర్థి బండ జయసుధరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ రామ్చందర్రావుతో కలసి ప్రచారం నిర్వహించారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలను ఇప్పుడే నిర్వహించి... పేదలకు వరద సాయం అందకుండా అడ్డుకున్నారని విమర్శించారు. వరదసాయం పంపిణీలోనూ అవకతవకలు జరిగాయని కిషన్రెడ్డి ఆరోపించారు. గ్రేటర్ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంటుందని ధీమావ్యక్తం చేశారు.
వేల కోట్లు ఎక్కడ ఖర్చుచేశారు: కిషన్రెడ్డి - kishan reddy allegations on trs government
ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడే ఎందుకు నిర్వహిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా సోమవారం.. తార్నాక డివిజన్ లాలాపేటలో పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.
వేల కోట్లు ఎక్కడ ఖర్చుచేశారు: కిషన్రెడ్డి
లాలాపేటలో బండ కార్తికరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు భాజపాలో చేరారు. వారందరికీ కేంద్రమంత్రి కిషన్రెడ్డి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.