జమ్మూకశ్మీర్‌పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అమరనాథ్ యాత్రకు ముప్పు ఉందన్న ఐబీ సూచన మేరకే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని తెలుగుప్రజలు సహా మరెవరి భద్రతకూ ఢోకా లేదన్నారు. జమ్ము నుంచిరాత్రి 20 మంది ఎన్‌ఐటీ తెలుగు విద్యార్థులు బయలుదేరారన్నారు. ఎన్‌ఐటీ తెలుగు విద్యార్థులు మధ్యాహ్నం వరకు దిల్లీ చేరుకుంటారని తెలిపారు. మిగిలిన 90 మంది విద్యార్థులు ఉదయం ప్రత్యేక రైలులో దిల్లీ బయలుదేరారన్నారు. జమ్ము నుంచి విద్యార్థులు, పర్యాటకులు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హోశాఖ, స్థానిక ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
'ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' - http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/04-August-2019/4035710_kishanreddy_rp.mp4
అమర్నాథ్ యాత్రకు ముప్పుందన్న ఐబీ సూచనల మేరకే జాగ్రత్తలు తీసుకుంటున్నామని... ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. జమ్మూకశ్మీర్‌లో తెలుగు ప్రజల భద్రతకు ఎలాంటి ఢోకాలేదన్నారు.
KISHANREDDY ON JAMMUKASHMIR ISSUE
Last Updated : Aug 4, 2019, 11:08 AM IST