Kishanreddy fires on CM KCR : కుటుంబ పాలన, అవినీతి నిర్మూలనే బీజేపీ లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రాత్రి దిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కిషన్‌రెడ్డి.. ఇవాళ సాయంత్రం హస్తిన నుంచి వచ్చిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇరువురు... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అదేవిధంగా ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు.
Kishanreddy Latest Comments : బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిధులిస్తున్నా.. రాష్ట్రప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే విషయం విషప్రచారంగా కొట్టిపారేసిన కిషన్‌రెడ్డి... ఇప్పటివరకు పొత్తులు, ఒప్పందాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే జరిగాయని వివరించారు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఒక కుటుంబమే పరిపాలన చేయటం, 9 ఏళ్లు సచివాలయానికి రాకపోవటం తెలంగాణ మోడలా అని ఆయన ప్రశ్నించారు.
'నిరంకుశ పాలనకు పాతర వేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఎస్సీలకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ సీఎం పీఠం ఎక్కారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు అతీగతి లేదు. ప్రతి నియోజకవర్గ కేంద్రం, మండల కేంద్రంలో ఆస్పత్రులు నిర్మిస్తాననే హామీ ఏమైంది. రైతులకు రూ.లక్ష రుణమాఫీ ఏమైందో కేసీఆర్ చెప్పాలి. గిరిజన బంధు అమలు ఏమైందో కేసీఆర్ చెప్పాలి. ఏపీలో 15 లక్షల ప్రభుత్వ ఇళ్లు నిర్మిస్తే ఇక్కడ అతీగతి లేదు. పార్టీ కార్యాలయాలకు భూములు ఇస్తున్నారు కానీ పేదలకు ఇవ్వట్లేదు. కేంద్రం సైన్స్ సిటీ ఏర్పాటు చేస్తామంటే భూమి ఇవ్వట్లేదు.'-కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
కుటుంబ పాలన, అవినీతిని పారదోలటమే బీజేపీ లక్ష్యం :వరంగల్‌లో రైల్వే వ్యాగన్ల మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను కేంద్రం నిర్మిస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఏడాదికి 2400 వ్యాగన్లు తయారు చేసే ప్లాంటును కేంద్రం నిర్మించనుందన్న ఆయన... ఆర్‌ఎంయూ కోసం తొలి దశలో రూ.521 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం కూడా కేంద్రం భారీగా ఖర్చు చేస్తోందన్న కేంద్రమంత్రి... రూ.5500 కోట్ల విలువైన హైవేల నిర్మాణానికి ఈనెల 8న ప్రధాని శంకుస్థాపనచేస్తారన్నారు. కుటుంబ పాలన, అవినీతిని పారదోలటమే బీజేపీ లక్ష్యమన్నారు. పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగటం లేదన్న కిషన్‌రెడ్డి... రాష్ట్రంలో నయా నిజాం తరహా పాలన సాగుతోందన్నారు.