సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికలో తెరాస ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలతో తెలంగాణ భవిష్యత్తుకు నాంది పలకాలన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలో భాజపా జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకు నాంది: కిషన్‌రెడ్డి
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి భూంపల్లి చౌరస్తాలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికలో తెరాసను ఓడించి తెలంగాణ భవిష్యత్తుకు నాంది పలకాలని ఆయన వ్యాఖ్యానించారు.
దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకు నాంది: కిషన్‌రెడ్డి
ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని భూంపల్లి చౌరస్తాలో రఘునందన్‌రావుతో రోడ్ షో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకున్నారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తెరాసకు వేసినట్లే విమర్శించారు. ఎంఐఎం పెంచి పోషిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడాలన్నారు. కమలం గుర్తుపై ఓటు వేసి భాజపా అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలను కోరారు.