Kishan Reddy on Home Guards Issues :హైదరాబాద్‌లోని గోషామహల్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ హోంగార్డు రవీందర్‌ను (Home Guard Ravinder).. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎటువంటి రాజకీయాలకు పాల్పడకుండా అతనికి న్యాయం చేయాలని కిషన్‌రెడ్డి తెలిపారు. హోంగార్డులు రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారని.. ఆ వ్యవస్థలో వారి శ్రమ దోపిడీ జరుగుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
Home Guard Ravinder Health Condition : హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలని అన్నారు. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో హోంగార్డులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు. వారిని రెగ్యులర్ చేస్తామని కేసీఆర్ శాసనసభలో హామీ ఇచ్చారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.
Miyapur Gun Fire Incident Solved : ఉద్యోగం పోయిందనే కోపంతో.. ఉసురు తీశాడు
Kishan Reddy on Home Guard Suicide Attempt :హోంగార్డు కుటుంబసభ్యులు జీతాలు లేక రోడ్డున పడుతున్నారని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నారని.. పోలీసు వ్యవస్థలో సైతం వారికి అవమానం జరుగుతోందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంగార్డులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేద్దామని.. పార్టీ తరఫున రవీందర్‌కు అండగా ఉంటామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
"హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం దురదృష్టకరం. హోంగార్డు వ్యవస్థలో శ్రమదోపిడి జరుగుతోంది. హోంగార్డు వ్యవస్థను ప్రభుత్వం అవమానిస్తోంది. హోంగార్డులు కొన్నిసార్లు 16 గంటలు పనిచేస్తున్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోంగార్డులను గుర్తించాలి. ప్రత్యేక బందోబస్తు సమయాల్లో హోంగార్డులకు ప్రత్యేక అలవెన్సులు ఇవ్వాలి. హోంగార్డులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు