కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చిలకలగూడలోని కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి పచ్చదనంతో దేశం వెలుగొందాలని పేర్కొన్నారు. ఆలయ ఈవో కృష్ణ, స్థానిక కార్పొరేటర్ హేమ పూర్ణకుంభంతో కిషన్‌రెడ్డికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ఘనంగా సన్మానించారు.
కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి - చిలకలగూడ
బోనాల జాతర సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి చిలకలగూడలోని కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. దేశ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
కట్టమైసమ్మ ఆలయాన్ని సందర్శించిన మంత్రి కిషన్‌రెడ్డి
Last Updated : Jul 29, 2019, 10:41 AM IST