తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2019, 3:34 PM IST

Updated : Nov 30, 2019, 4:57 PM IST

ETV Bharat / state

"చట్టాలను మారుస్తాం... ఎమర్జెన్సీ యాప్‌ తీసుకొస్తాం"

బ్రిటీష్‌ కాలంనాటి చట్టాలను మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

kishan reddy talk on shamshabad murder case
"చట్టాలను మారుస్తాం... ఎమర్జెన్సీ యాప్‌ తీసుకొస్తాం"

శంషాబాద్​లో వైద్యురాలి హత్య దేశమంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసిందని కిషన్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు నిరోధించేందుకు దిల్లీలో ప్రత్యేక యాప్‌ తీసుకువచ్చామని చెప్పారు. ఆపదలో ఉన్న వారు 112 నంబర్‌కు ఫోన్‌ చేస్తే... ఐదుగురికి సమాచారం వెళ్తుందని తెలిపారు. ఆ ఎమర్జెన్సీ యాప్‌ను రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

పోలీసులు పరిధి చూడొద్దు...
పోలీసులు పరిధులతో సంబంధం లేకుండా ఫిర్యాదు వస్తే కేసు స్వీకరించాలని కిషన్ రెడ్డి ఆదేశించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పోలీసులు వ్యవహరించాలని సూచించారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాని చెప్పారు.

"చట్టాలను మారుస్తాం... ఎమర్జెన్సీ యాప్‌ తీసుకొస్తాం"

ఇదీ చూడండి: శంషాబాద్‌లో మరో దారుణం.. కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం

Last Updated : Nov 30, 2019, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details