ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన తొలి మహిళా నేత ఈశ్వరీబాయి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి గీతారెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు కేవీ రమణాచారి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
'ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన మొదటి మహిళానేత ఆమె' - హైదరాబాద్ తాజా వార్త
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం ఆనాటి అసెంబ్లీలో గళం విప్పి పోరాటం చేసిన మొదటి మహిళానేత ఈశ్వరీబాయి అనే కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రవీంద్రభారతిలో ఈశ్వరీభాయి వర్ధంతి వేడుకలు
ఈశ్వరీబాయి అంబేడ్కర్ వాది అని.. అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి... స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించిన పలువురు మహిళలను ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డుతో సత్కరించారు.