Kishan Reddy Will Speech On United Nations In NewYark : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన ఆహ్వానం లభించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న అంతర్జాతీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన వక్తగా ప్రసంగించే అవకాశం కిషన్ రెడ్డికి లభించింది. ఇప్పటి వరకు ఈ అవకాశం లభించిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కావడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో.. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం వేదికగా జరగనున్న ప్రపంచ ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్ సమావేశాల్లో కిషన్ రెడ్డి ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
Kishan Reddy Received Call From United Nations : భారతదేశం జీ-20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యాటక మంత్రిగా, ‘జీ-20 దేశాల టూరిజం చైర్’ హోదాలో కిషన్ రెడ్డి ఈ అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇటీవలే గోవాలో జరిగిన జీ-20 దేశాల పర్యాటక మంత్రులు, 9 ప్రత్యేక ఆహ్వానిత దేశాల మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ఈ సందర్భంగా భారతదేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించిన సంగతి తెలిసిందే.
Kishan Reddy Speech At High Level Political Forum Meetings : ఈ నేపథ్యంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్షాలను చేరుకోవడం, అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ ఇతివృత్తం (థీమ్)తో జులై 13, 14 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. వివిధ దేశాల ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం కీలక పోషిస్తోంది. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత.. భారతదేశ ప్రతిష్ఠ దశదిశలా వ్యాపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.