గాంధీజీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. గాంధీజీ ఆశయాలు, ఆదర్శాలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఏపీఎఫ్ ఆధ్వర్యంలో 5 వేల మందితో 2 వేల కిలో మీటర్ల మేర సైకిల్ యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. రేపు ఉదయం 9 గంటలకు పోర్‌బందర్ వద్ద ఈ యాత్రను స్వయంగా తానే ప్రారంభిస్తానని... అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి దిల్లీ రాజ్‌ఘాట్ చేరుకుంటామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. యాత్రలో పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు.
పోరుబందర్ నుంచి దిల్లీ వరకు సైకిల్ యాత్ర - మహాత్మ గాంధీ
గాంధీజీ ఆశయాలను యువతకు చేరవేసే ఉద్దేశంతో... బాపూజీ స్వస్థలమైన పోర్‌బందర్ నుంచి దిల్లీ రాజ్‌ఘాట్ వరకు సైకిల్ యాత్ర చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.
పోరుబందర్ నుంచి దిల్లీ వరకు సైకిల్ యాత్ర