తెలంగాణకు కేంద్రం నుంచి బృందాలను పంపిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రేపు, ఎల్లుండి కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తుందన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుందన్నారు. కేంద్ర బృందంలో వ్యవసాయం, జాతీయ రహదారులశాఖకు చెందిన అధికారులు ఉంటారన్నారు. వరద బాధితులకు విపత్తు నిధి నుంచి సహాయం అందిస్తామన్నారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబానికి రూ.4 లక్షలు ఇవ్వాలని గతంలోనే కేంద్రం చట్టం చేసిందని వెల్లడించారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం విరివిగా సాయం చేస్తోందన్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి బృందాలు పంపిస్తున్నాం: కిషన్ రెడ్డి - కిషన్ రెడ్డి తాజా వార్తలు
"తెలంగాణకు కేంద్రం నుంచి బృందాలను పంపిస్తున్నాం. రేపు, ఎల్లుండి కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తుంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కేంద్రం బృందం పరిశీలిస్తుంది. వరద బాధితులకు విపత్తు నిధి నుంచి సహాయం అందిస్తాం. తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం సహాయం చేయడం లేదనే ఆరోపణ సరికాదు. నష్టం అంచనా, కేంద్ర సహాయం విషయంలో ఒక నిర్దిష్ట విధానం ఉంటుంది." -కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు అనవసర విమర్శలు చేస్తున్నారని.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం సాయం చేయడం లేదనే ఆరోపణలు సరికాదన్నారు. నష్టం అంచనా విషయంలో నిర్దుష్ట విధానం ఉంటుందన్నారు. కేంద్రం బృందం నివేదిక ఆధారంగా తెలంగాణకు సాయం ఉంటుందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా.. అది ప్రజల సొమ్మేనని.. విపత్తునిధిలో 75 శాతం వాటా కేంద్రానిదేనని గుర్తుచేశారు. చెరువుల ఆక్రమణలు కాంగ్రెస్ తరహాలోనే జరిగాయని.. తెరాస ప్రభుత్వ హయాంలోనూ అవి ఆగడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
ఇదీ చదవండి:రామాంతపూర్‌లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్‌రెడ్డి