డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రభుత్వాలు సరిగా పని చేయడం లేదని ప్రశ్నించడం కాదు. మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా సరియైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.