సబ్‌కే సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో నరేంద్రమోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రేపు మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సేవా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మోదీ నిర్ణయాత్మక విధానాలు దేశానికే ఆదర్శం : కిషన్ రెడ్డి - Union Home Minister Kishan Reddy
మోదీ నిర్ణయాత్మక విధానాలు దేశానికే ఆదర్శనీయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
మోదీ నిర్ణయాత్మక విధానాలు దేశానికే ఆదర్శం : కిషన్ రెడ్డి
దిల్లీలో పేదప్రజలకు నిత్యావసర సరకులు అందజేసిన కిషన్‌రెడ్డి.. మోదీ తీసున్న నిర్ణయాత్మక విధానాల వల్ల దేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గౌరవ ప్రతిష్టలు మరింత పెరిగాయని అన్నారు. ప్రజల విశ్వాసం, తోడ్పాటుతో దేశాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారని అభిప్రాయపడ్డారు. మోదీ గత ఆరేళ్లుగా నిస్వార్థ సేవ, దూరదృష్టి సమర్థవంతమైన నాయకత్వంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి :శ్రావణి ఆత్మహత్య కేసులో సినీ నిర్మాత అశోక్‌రెడ్డి అరెస్టు
Last Updated : Sep 16, 2020, 12:41 PM IST