తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం మీద నెట్టడం సరికాదు' - telangana government failures to the center

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం మీద నెట్టడం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. సచివాలయం కూల్చివేతపై పెట్టిన దృష్టి కరోనాపై పెడితే బాగుండేదన్నారు.

kishan reddy said It is not right to push telangana government failures to the center
'ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం మీద నెట్టడం సరికాదు'

By

Published : Sep 11, 2020, 10:44 PM IST

సీఎం కేసీఆర్ శాసనసభ వేదికగా తప్పుడు ఆరోపణలు చేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వివక్షతో కాదు విచక్షణతో పని చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రం మీద నెట్టడం సరికాదని హితవు పలికారు. సచివాలయం కూల్చివేతపై పెట్టిన దృష్టి కరోనాపై పెడితే బాగుండేదన్నారు.

పారా సిటమాల్​తో కరోనా పోతుందని

మజ్లిస్ మెప్పు కోసం మోదీపై దుమ్మెత్తి పొసే ప్రయత్నం చేయొద్దని సూచించారు. పారాసిటమాల్​తో కరోనా పోతుందని మాట్లాడిన కేసీఆర్​కి... కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. 1400 వెంటిలేటర్స్ తెలంగాణకు వస్తే ఇప్పటికి 500 వెంటిలేటర్స్ సీల్ కూడా తీయలేదని విమర్శించారు. 13 లక్షల 85 వేల ఎన్​ 95 మాస్క్స్, 2 లక్షల 41 వేల పీపీఈ కిట్స్ , 42 లక్షల హెచ్​క్యూ టాబ్లెట్స్ కేంద్రం ఇచ్చిందని తెలిపారు. ఉచిత బియ్యం, ఉపాధి హామీ పని దినాలు పెంపు, 52 లక్షల మహిళల జన్​ధన్ ఖాతాల్లో డబ్బులు, రైతు సమ్మాన్ నిధి కింద 32 లక్షల రైతుల ఖాతాల్లో 666 కోట్లు వేయడం జరిగిందన్నారు. వారంతా తెలంగాణ ప్రజలు కారా అని కేసీఆర్​ను ప్రశ్నించారు.

ఆయుష్మాన్ భారత్​ అన్ని రాష్ట్రాల్లో..!

సీఎం పనికి రాని పథకం అంటున్న ఆయుష్మాన్ భారత్​ను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. పనికొచ్చే ఆరోగ్యశ్రీలో తెలంగాణ ప్రజలకు కరోనా వైద్యాన్ని ఎందుకు చేర్చలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ చెబుతున్న హెలికాప్టర్ మనీ పై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మద్దతు తెలపడం లేదని పేర్కొన్నారు. కేంద్ర తీసుకొచ్చే విద్యుత్ చట్టం వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. శనివారం రామగుండం ఫర్టిలైజర్స్ వద్దకు వెళ్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ విషయంలో కేంద్రం సూచించిన ఆప్షన్స్ సీఎంకి నచ్చడం లేదని ఎద్దేవా చేశారు.

ఇదీ చూడండి :జంతువులపై కొవాగ్జిన్‌ సత్ఫలితాలిచ్చింది: భారత్​ బయోటెక్​

ABOUT THE AUTHOR

...view details