తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపా' - telangana news today

11 కోట్ల సభ్యులతో ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా భాజపా అవతరించిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పద్మారావు నగర్​లో కేంద్రమంత్రి సమక్షంలో 100 మందికి పైగా భాజపాలో చేరారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు.

kishan reddy said BJP emerges as largest party in world
'ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపా'

By

Published : Feb 15, 2021, 3:12 AM IST

బంసిలాల్ పేట్, పద్మారావు నగర్​కు చెందిన వంద మందికి పైగా కార్యకర్తలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి సమక్షంలో భాజపాలో చేరారు. ఈ సందర్భంగా భాజపా అతి పెద్ద కుటుంబమని కిషన్​రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో సభ్యులుగా చేరిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

గతంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అతిపెద్ద పార్టీగా ఉండేదని.. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా భాజపా అవతరించిందని ఆయన పేర్కొన్నారు. భాజపా బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించి వారి సేవలను గుర్తు చేసుకున్నారు.

పద్మారావు నగర్​లోని స్వరాజ్ ప్రెస్ భవన్​లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్, సహా పలువురు నాయకులు హాజరయ్యారు.

ఇదీ చూడండి :తెలంగాణ పల్లె అందాలకు బ్రిటిష్ కమిషనర్​ ఫిదా

ABOUT THE AUTHOR

...view details