తెలంగాణ

telangana

ETV Bharat / state

పరీక్షలంటే పండగలా ఉండాలి.. భయం ఉండకూడదు: కిషన్​రెడ్డి

Central Minister Kishan Reddy presented Exam Warriors book to teachers: ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు.. విద్యార్థులు పరీక్షలతో భయపడతారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధాని మోదీ రాసిన ఎగ్జామ్​ వారియర్స్​ పుస్తకాన్ని ఉపాధ్యాయులకు అందించారు. ఆ తర్వాత విద్యార్థులను ఉద్దేశించి కేంద్రమంత్రి ప్రసంగించారు.

Central Minister Kishan Reddy
కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

By

Published : Jan 21, 2023, 3:54 PM IST

Exam Warriors book written by PM Narendra Modi: విద్యార్థుల చదువు దేశ భవిష్యత్తుకు పునాది అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు చెప్పింది.. విద్యార్థులకు అర్థం కాకపోతే సిగ్గు, భయం పడకుండా అడిగి తెలుసుకోవాలని సూచించారు. హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​లో ఉన్న భవాని నగర్​ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాని నరేంద్ర రాసిన 'ఎగ్జామ్​ వారియర్స్​' పుస్తకాన్ని ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ప్రసంగించారు.

ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు.. పరీక్షలు దగ్గర పడ్డట్టే అని విద్యార్థులు భయపడతారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కానీ పరీక్షలు అంటే విద్యార్థులు భయంతో ఉండకూడదు.. ఎంతో విశ్వాసంతో చదివి అందులో సక్సెస్​ కావాలని సూచించారు. మంచి భవిష్యత్తు, విజ్ఞానం ఇవ్వడానికి మంచి ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. ఒకప్పుడు అబ్బాయిలను ప్రైవేట్​ పాఠశాలలో, అమ్మాయిలను ప్రభుత్వం స్కూల్​లలో చేర్చేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా పూర్తిగా మారిపోయింది. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో చదివి ముందుకెళ్లి ఎన్నో విజయాలను సాధిస్తున్నారని కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివితే మంచి మార్కులు వస్తాయి.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే రావు అనే ధోరణిని పక్కన పెట్టాలని కిషన్​రెడ్డి వివరించారు. అన్ని విషయాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు అన్న వివక్ష చూపరాదని.. దేశ రక్షణలో సైతం అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు ఉన్నారని గుర్తు చేశారు. కడుపులో ఉండగానే ఆడబిడ్డ అని తెలిసి వారి చంపాలని చూస్తున్నారు.. ఈ ఆడశిశువుల హత్యలు పోవాలని ప్రధాన మంత్రి మోదీ సంకల్పించి భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ఈరోజుల్లో ఉన్న వ్యవస్థకు చాలా మార్పులు వచ్చాయని స్పష్టం చేశారు.

ఈనెల 27వ తేదీన ప్రధాని మోదీ పరీక్షలపై కోట్లాది మంది విద్యార్థులతో వర్చువల్​గా మాట్లాడి వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతారు వెల్లడించారు. పరీక్షల మీద ఉన్న భయాన్ని మోదీ పోగొట్టే ప్రయత్నం చేస్తారన్నారు. పరీక్షలు అంటే భయం వదలి పండగ వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థుల కోసమే పీఎం మోదీ ఎక్సమ్​ వారియర్స్​ పుస్తకాన్ని రాశారని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపు ఉండకూడదని.. గొప్పగొప్పవాళ్లు అందరూ ఈ పాఠశాలల్లోనే చదువుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేసి.. వాటి రూపురేఖలు మార్చి.. విద్యార్థులను ఆకర్షించే విధంగా తయారు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

"విద్యార్థులు అందరూ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలి. ఎవరూ పరీక్షల్లో తప్పకూడదు అనే ఉద్దేశ్యంతో.. పరీక్షలపై చర్చా కార్యక్రమం ద్వారా దేశ నలుమూలల తిరుగుతున్నాము. ప్రధాని నరేంద్రమోదీ విద్యార్థులల్లో పరీక్షలంటే భయాన్ని తొలగించి, పరీక్షలు అంటే పండగ చేసుకొనే విధంగా ఉండాలి. పరీక్షల్లో ఎలా చదవాలనే టెక్నిక్​ను మోదీ ఈ పుస్తకంలో వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడకుండా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలి. గొప్పగొప్ప వ్యక్తులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు." - కిషన్​ రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి

పరీక్షలంటే పండగలా ఉండాలి భయం పడకూడదు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details