తెలంగాణ

telangana

ETV Bharat / state

BJP development works in Telangana : 'మోదీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధి ఇదే' - Central Government funds in Telangana

Narendra Modi nine years Development works in Telangana : నరేంద్రమోదీ ప్రభుత్వంలో రాష్ట్రాల పన్నుల వాటా పంపిణీ 32 శాతం 42శాతంకి పెంచినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2004-14 ఏళ్ల కాలంలో రూ.18.50లక్షల కోట్ల నిధులు రాష్ట్రాలకు ఇస్తే ..మోదీ ప్రభుత్వం వచ్చాక 2014-23 వరకు రూ.69.60లక్షల కోట్ల నిధులు రాష్ట్రాలకు అందించారన్నారు. గత యూపిఏ ప్రభుత్వంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం 3.75 రెట్లు ఎక్కువ నిధులు రాష్ట్రాలకు ఇచ్చిందన్నారు. గడిచిన 9 ఏళ్లలో పన్నుల వాటా రూపంలో తెలంగాణకు రూ.1.60లక్షల కోట్లు అందించినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Kishan Reddy
Kishan Reddy

By

Published : Jun 17, 2023, 8:04 PM IST

'మోదీ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధి ఇదే'

BJP government Development works in Telangana : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గడిచిన 9 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధుల లెక్కలను కిషన్ రెడ్డి వెల్లడించారు. వివిధ రంగాల వారీగా కేటాయింపులను వివరించారు. 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టినప్పటి నుంచి రూ.8వేల 379 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి పరిహారంగా అందిందని కిషన్ రెడ్డి తెలిపారు.

2020 నుంచి 2022 మధ్య కరోనా సమయంలో రూ.6వేల 950కోట్ల రుణం కూడా కేంద్ర ప్రభుత్వమే భరించిందన్నారు. జీఎస్టీ పరిహారం కింద కేంద్రం రూ.15వేల 329 కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిరంతర సహకారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ ముఖ్యనేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రూ.5.27 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

Central Government funds in Telangana : బడ్జెటేతర రుణాలతో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రూ.9.81లక్షల కోట్ల అప్పులు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు రూ.9.26లక్షల కోట్లు రుణాలు ఇచ్చిందన్నారు. తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద ఉత్పత్తుల సేకరణ, కనీస మద్దతు ధర వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.35లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(2) ప్రకారం రాష్ట్రంలోని వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.2వేల 250 కోట్లు ఇచ్చిందన్నారు.

Kishan Reddy latest news : హైదరాబాద్ మినహాయించి పాత పది జిల్లాల్లో ఈ నిధులు ఖర్చు చేశారన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణాలో రైల్వే మౌలిక వసతులు గణనీయంగా పెరిగాయన్నారు. 2014-23 వరకు రైల్వే విద్యుదీకరణ 37వేల 11కి.మీలు చేపట్టారని మంత్రి తెలిపారు. రైల్వే విద్యుదీకరణకు 660 శాతం పెంచారన్నారు. 216శాతం రైల్వే లైన్ల అభివృద్ధి చేసినట్లు తెలిపారు. యూపీఏ హయాంలో రోజుకు సగటున 17కి.మీలు కొత్త రైల్వే లైన్​లను నిర్మిస్తే... మోదీ ప్రభుత్వం రోజుకు సగటున 55కి.మీల కొత్త రైల్వేలైను నిర్మించారన్నారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 3 కొత్త రైల్వే లైన్​లు 335 కి.మీల మేర 10 రైల్వే ప్రాజెక్టుల డబ్లింగ్, 239 కి.మీల మేర ట్రిప్లింగ్ పూర్తయిందన్నారు. రూ.30వేల 62 కోట్ల అంచనా వ్యయంతో 1,645కి.మీల కొత్తలైన్ నిర్మించారన్నారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ పునరుద్దరణ పనులు చేస్తున్నట్లు గుర్తు చేశారు. రూ.221 కోట్లతో చర్లపల్లి టర్మినల్ అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఎం.ఎం.టీ.ఎస్ రెండో దశ కోసం రూ.1,153 కోట్లు విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద కేవలం రూ.279 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, ఇంకా రూ.290 కోట్లు నిధులు విడుదల చేయాల్సి ఉన్నా చేయడంలేదన్నారు.

రూ.521 కోట్లతో కాజీపేట్​లో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తుందన్నారు. రహదారులకు భారీగా నిధులు వెచ్చిందన్నారు. జాతీయ రహదారుల కోసం రూ.1.08కోట్లు మంజూరు చేసిందన్నారు. 9 ఏళ్లలో 2,500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించారని, రూ.21వేల 201 కోట్లతో 348 కి.మీల రీజనల్ రింగ్ రోడ్, రూ.1,906 కోట్లతో 99కి.మీల యాదాద్రి-వరంగల్ నాలుగు లేన్ల రహదారి, రూ.1,613.97 కోట్లతో రాంసానిపల్లె-మంగ్లూరు రహదారి, రూ.1,312.10 కోట్లతో మంగ్లూరు-మహారాష్ట్ర సరిహద్దు వంటివి వీటిలో ఉన్నాయన్నారు.

New railway lines in Telangana : సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ప్రారంభించారన్నారు. సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 450 రూట్లలో ఉడాన్ విమానాలు తిరుగుతుండగా అందులో 10శాతం హైదరాబాద్​కు కేటాయించారన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం బలోపేతం చేసేందుకు కేంద్రం ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్ మెంట్ స్కీమ్ కింద రూ.394.19 కోట్లు, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన కింద రూ.278 కోట్లు విడుదల చేసిందన్నారు.

రాష్ట్రంలోని అణుశక్తి సంబంధిత సంస్థలు-హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, హెవీ వాటర్ ప్లాంట్, ఈసీఐఎల్, జోనకీ ల్యాబోరేటరీ, సెంటర్ ఫర్ కాంపోజినల్ క్యాకక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, మణుగూరులోని హెవీ వాటర్ ప్లాంట్ కోసం రూ.28,971.77 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలంగాణలో రూ.4,154 కోట్లు ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలో వరి సేకరణ ఆరు రెట్లు పెరిగిందన్నారు. వరి సేకరణ కోసం కేంద్రం రూ.1.24 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. తద్వారా 20లక్షల మంది రైతులకు లబ్ది చేకూరిందన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 2.50లక్షల ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. 2.33లక్షల ఇళ్లు పూర్తయ్యయని స్పష్టం చేశారు. 138 పట్టణాల్లో ఈ పథకం అమలు చేశామన్నారు. వైద్యరంగం బలోపేతం కోసం కేంద్రం రూ.1,366 కోట్లతో ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ స్థాపించిందన్నారు. ప్లోరోసిస్ నిర్మూలన కోసం 1040 గ్రామాలకు రూ.795 కోట్లు కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖ విడుదల చేసిందన్నారు. తెలంగాణలో 7.8 కోట్ల కరోనా టీకా డోసులు ఉచితంగా అందించరన్నారు. అందుకు కేంద్రం రూ.1,800 కోట్లు వ్యయం చేసిందన్నారు.

కరోనా సమయంలో అత్యవసర ఎమర్జెన్సీ ప్యాకేజీ కింద తెలంగాణకు రూ.685.05 కోట్లు విడుడల చేసిందన్నారు. కేంద్రం పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహాన్ని, విద్యారంగానికి చేయూతనిచ్చిందన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కు రూ.7వేల 461 కోట్లు, వయోజన విద్యకు రూ.104.64 కోట్లు విడుదల చేసిందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి రూ.1,663 కోట్లు ఇచ్చిందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details