తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy On TS Decade Celebrations : 'గవర్నర్ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఆవిర్భావ వేడుకలు' - ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా వార్తలు

Kishan Reddy On Telangana Formation Day Celebrations : కేంద్ర ప్రభుత్వం తరఫున గోల్కొండ కోటలో రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పరిశీలించారు. ఆధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. అజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

golconda
golconda

By

Published : Jun 1, 2023, 1:07 PM IST

Updated : Jun 1, 2023, 1:43 PM IST

'గవర్నర్ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఆవిర్భావ వేడుకలు'

Telangana Formation Day Celebrations at Golconda :ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు ఆవిర్భావ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. రోజుకు ఒక శాఖ చొప్పున 21 రోజుల పాటు ఆయా శాఖల వారీగా తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ దిశగా ఆయా శాఖల మంత్రులు, అధికారులు చర్యలు కూడా చేపట్టారు.

Congress On Telangana Formation Day Celebrations : మరోవైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను.. రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు నిర్వహించాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీఆర్​ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జూన్ 2 నుంచి 20 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

Kishan Reddy On Telangana Formation Day 2023 :ఓవైపు బీఆర్ఎస్.. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రంగం సిద్ధం చేస్తోంటే.. కేంద్ర సర్కార్ తరఫున అవతరణ దినోత్సవం జరపాలని బీజేపీ నిర్ణయించింది.తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ముందుండి నడిచిందని.. సుష్మ స్వరాజ్ సైతం తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరుఫున గోల్కొండ కోటలో రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగున్నాయని తెలిపారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధిచిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆధికారులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. గవర్నర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయని వివరించారు. పలు సాంస్కృతిక కార్యాక్రమాలు సహా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని.. ప్రజలంతా తరలివచ్చి వేడుకల్లో పాల్గొనాలని అయన కోరారు.

"భారత ప్రభుత్వం తరఫున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తున్నాం. చారిత్రకంగా గోల్కొండ కోటలో ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ ఈ ఉత్సవానికి హాజరవుతారు. ప్రజలంతా వచ్చి వేడుకల్లో పాల్గొనండి. 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పాటైంది. ". -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

Telangana Decade Celebrations 2023 :తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ ఇందులో హాజరవుతారని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 1200 మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ఏర్పాటు అయ్యిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో దిల్లీలో నిరసన తెలుపుతుంటే జంతర్​ మంతర్​లో తమపై కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సార్లు లాఠీ ఛార్జ్ చేసిందని మండిపడ్డారు. అజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మొదటిసారి అన్ని రాష్ట్రాల రాజ్​భవన్లలో తెలంగాణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గత ఏడాది ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు పూర్తి సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 1, 2023, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details