BJP State President Kishan Reddy on Telangana Assembly Elections 2023 Schedule :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections 2023) షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(BJP State president Kishan Reddy) అన్నారు. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగవని వెల్లడించారు. అలాగే బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ సంవత్సరం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలన్ని సన్నద్ధమవుతున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార పార్టీకి ఈసారి ఎలాగైన గెలిచే అవకాశం ఇవ్వకుండా చూడాలని ప్రతిపక్ష పార్టీలు తమ వంతు కృషి చేస్తూ.. పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నాయి. అందులో భాగంగా ఎన్నికల్లో ప్రముఖ ఘట్టమైన అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేస్తున్నాయి.
Kishan Reddy Fires On CM KCR : 'ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలమయ్యారు'
Telangana Congress MLA Candidates 2023 :ఇటీవలే కాంగ్రెస్(Telangana Congress MLAs List) తమ అభ్యర్థులను ప్రకటించేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. వెయ్యికి పైగా దరఖాస్తులు రావడంతో పార్టీ ప్రాధాన నాయకులు ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టారు. ఇప్పటికే ఈ అంశంపై స్క్రీనింగ్ కమిటీని వేసింది. ఈ నెల 15 తర్వాత కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనుంది. ఇదే పంథాను తెలంగాణ బీజేపీ కూడా అనుసరిస్తోంది.