హైదరాబాద్ ఖైరతాబాద్ చింతల్ బస్తీలోని రాంమేళ మైదానంలో వాలీబాల్ టోర్మమెంట్ పోటీలను కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు, యువతలో ఆటలపై అభిలాష దక్కుతుందని... సరైన క్రీడమైదానాలు, కోచింగ్లు లేక, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్లే కారణమవుతున్నాయన్నారు.
'దేశవాళీ క్రీడలను ప్రోత్సహించాలి' - వాలీబాల్ పోటీలు
మన దేశవాలీ క్రీడాలను ప్రోత్సాహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడాలకు ప్రోత్సాహం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'దేశవాళీ క్రీడలను ప్రోత్సహించాలి'
నేటి యువత ఎక్కువ సమయం సెల్ఫోన్లు, సామాజిక మాధ్యామాలపై కేటాయించటం వల్ల దేశం మీద, ఆటలపై ఆసక్తి సన్నగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువశక్తి నిర్విర్యం అయితే దేశానికే ప్రమాదకరమన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి:కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా