Kishan Reddy on Parliament Elections 2024: రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్‌తో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమావ్యక్తం చేశారు. దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిలో బీజేపీ అధికారం సాధించిందని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలను సెమీఫైనల్‌గా కాంగ్రెస్ అభివర్ణించి రెచ్చగొట్టే ప్రయాత్నాలు చేసిందని మండిపడ్డారు. ఆ పార్టీ మిత్రపక్షాల సవాల్‌ను ప్రజలు స్వీకరించి స్పందించారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్మారని విశ్వాసం వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఓటింగ్ శాతం పెరిగిన ఏకైక పార్టీ బీజేపీ : కిషన్‌రెడ్డి
Parliament Elections 2024: మూడు రాష్ట్రాల్లో కుటుంబ సభ్యులు లేని ప్రజపాలనకు ప్రజలు పట్టం కట్టారని కిషన్రెడ్డిఅన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ సారి దిల్లీ ఓటు మోదీకే అని అన్ని వర్గాలు ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(Parliament Elections 2024) మోదీ హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నామని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి