భారతదేశంతో పాటు ఇజ్రాయెల్ కూడా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రెండు దేశాలు కలిసి టెర్రరిజాన్ని తిప్పికొట్టేందుకు కృషి చేస్తున్నాయని వెల్లడించారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని మహేశ్వరంలోని హార్డ్‌వేర్ పార్కులో అస్ట్రా రాఫెల్ డిఫెన్స్ కమ్యూనికేషన్ స్టేట్ ఆఫ్ ది సెంటర్‌ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇజ్రాయెల్‌కు చెందిన రాఫెల్ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇండియాకు చెందిన అస్ట్రా మైక్రోవేవ్‌లు సంయుక్తంగా ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఇండియన్ డిఫెన్స్‌కు కావాల్సిన కమ్యూనికేషన్ టెక్నాలజీని ఈ సెంటర్‌లో అభివృద్ది చేయనున్నారు. తెలంగాణను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే పదేళ్లలో ప్రతి ఏటా 90 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రధాని సంకల్పంగా పెట్టుకున్నారని కేంద్రమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
'డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాదే హబ్' - డిఫెన్స్
డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ హబ్‌గా మారిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. అస్ట్రా రాఫెల్ డిఫెన్స్ కమ్యునికేషన్ స్టేట్ ఆఫ్ ది సెంటర్ ఏర్పాటు ద్వారా సుమారు వెయ్యి చిన్న మధ్య తరహా సంస్థలకు ఉపాధి దొరుకుతుందని అయన వివరించారు.
'డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాదే హబ్'