Kishan Reddy Comments on Congress and BRS : తెలంగాణ ప్రజల స్వాతంత్య్ర దినోత్సవాన్ని(Independence Day) కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబరు 17న ఉత్సవాలు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. దిల్లీలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై మండిపడ్డారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సమైక్యతా దినోత్సవం(Telangana Liberation Day) జరుపుతోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమోచన దినోత్సవాన్ని జరపాలని కేసీఆర్ అడగలేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మజ్లిస్‌కు భయపడి 9 ఏళ్లుగా ఎలాంటి ఉత్సవాలు సీఎం కేసీఆర్ జరపలేదని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో ముక్తి దివస్ పేరుతో సెప్టెంబరు 17న వేడుకలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.
"రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామగ్రామాన అధికారికంగా విమోచన దినోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తాం. స్వాతంత్య్ర, గణతంత్ర వేడుకలు జరిగినంత గొప్పగా ఈ వేడుకలు చేయాలని స్వతంత్ర యోధులు కోరుకుంటున్నారు. కేసీఆర్ అధికారంలో లేనప్పుడు విమోచన, స్వాతంత్య్ర దినోత్సవం అన్నారు. సీఎం అయిన తర్వాత మజ్లిస్‌కు భయపడే సమైక్యతా దినోత్సవాన్ని జరుపుతున్నారు. అది కూడా కేవలం పబ్లిక్ గార్డెన్‌లో జెండా ఎగురవేసి చేతులు దులుపుకోవడాన్ని తెలంగాణ సమాజం కోరుకోవడం లేదు. సమైక్యతా దినోత్సవం ఏ ప్రాతిపదికన జరుపుతున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి" అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
BRS Celebrates Telangana National Integration Day : రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా సంబురాలు
Kishan Reddy on Telangana Liberation Day : తెలంగాణ స్వాతంత్య్ర ఉత్సవాలు జరపాలంటూ 28 ఏళ్లుగా బీజేపీ పోరాటం చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న తనను కేంద్రమంత్రినని చూడకుండా వేధించారని.. దీక్షకు అనుమతి ఇచ్చి ఎందుకు అడ్డుకున్నారో కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.
"తెలంగాణ ప్రజల నిరంతరం పోరాటంతోనే రాష్ట్రం సిద్దించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలంగాణ బిల్లును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ పార్టీని దంచి కొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మోసపూరితమైన హామీలను కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాలు.. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే. అమలు చేయలేని హామీలు ప్రకటించి.. ప్రజలను మభ్యపెడుతున్నారు. బీఆర్‌ఎస్ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడు ఎకరాల భూమి ఇలా అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదు."-కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు
Kishan Reddy Fires on Congress and BRS కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభ.. బీఆర్‌ఎస్ స్పాన్సర్ చేసినట్లుగా ఉంది Asaduddin Owaisi on National Unity Day : 'హైదరాబాద్‌కు వచ్చి.. అమిత్ షా అబద్ధాలు చెప్పారు'
Kishan Reddy Sensational Comments on Congress : ఆదివారం జరిగిన కాంగ్రెస్ సభ బీఆర్‌ఎస్ స్పాన్సర్ చేసిన సభగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. భావితరాలకు తెలంగాణ ప్రజల పోరాటాన్ని తెలియకుండా చేయాలనే కుట్రలో భాగంగానే సెప్టెంబరు 17న హైదరాబాద్‌లో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేసిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సభ పెట్టే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని ధ్వజమెత్తారు. పైగా ఆ సభలో కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరూ.. హైదరాబాద్ విమోచన దినోత్సవంపై మాట్లాడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకరికొకరు సహకరించుకుంటూ.. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనికి ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తోందని అన్నారు.
PM Modi On Telangana Formation in Parliament : 'తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది.. రక్తపుటేర్లు పారాయి'
Amit Shah Speech at Telangana Liberation Day 2023 : 'పటేల్ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు'