Kishan Reddy Fires on CM KCR: గజ్వేల్ నియోజకవర్గంలోని ల్యాండ్ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం కామారెడ్డి నుంచి గజ్వేల్‌కు బీజేపీ నేత రమణారెడ్డి ఆధ్వర్యంలో వెళుతున్న వారిని అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి ఖండించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్(Etela Rajender) సమక్షంలో పార్టీలో చేరారు.
Congress Leaders Joined in BJP Party: ఈ సందర్భంగా రాబోయే కాలంలో బీజేపీలో భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగలేదని.. ఆ బాధ్యత బీజేపీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) రాక ముందే బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కామారెడ్డి నేతలు గజ్వేల్‌కు వెళతామంటే కేసీఆర్‌కు భయం ఎందుకు అని ప్రశ్నించారు. గజ్వేల్‌లో సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తే.. భీతి ఎందుకని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో రైతులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Kishan Reddy Nirmal Tour : 'రైతుల భూములతో వ్యాపారం చేయడానికే నిర్మల్ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారు'
Kishan Reddy Fires on Congress Party : బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేతలందరూ అన్నింట్లో కమీషన్లు, వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ ప్రభుత్వం అయితే.. బీఆర్ఎస్ వాటాల ప్రభుత్వం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన ఉత్సవాలు రాష్ట్రంలో నిర్వహిస్తామన్నారు. ఇతర పార్టీల్లో పని చేసిన చాలా మంది ఇటీవలి కాలంలో బీజేపీలో భారీ ఎత్తున చేరుతున్నారని ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా చాలా మంది చేరబోతున్నారన్నారు. ఇటీవల మీడియాలో కొందరు అనేక వార్తలు కావాలని రాస్తున్నారని.. ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో జెండా ఎగురవేసేది బీజేపీనే అని ఆయన స్పష్టం చేశారు.