Kishan Reddy Fires on CM KCR in Hyderabad : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అద్దాల మేడలో కూర్చుని రాళ్లు విసిరితే.. మీ అద్దాలే పగులుతాయని కేసీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. సీఎం కుటుంబానికి అధికారం తలకెక్కిందని మండిపడ్డారు. మోదీ వచ్చి ఇక్కడ చేసేదేంటని అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy Fires on KCR :కేసీఆర్ (KCR) ఫామ్‌హౌస్‌లో కూర్చుంటారే తప్ప.. ప్రజలకు మంచి చేద్దామని లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి.. సీఎం 10 ఎకరాల స్థలం ఇచ్చారని.. బీఆర్ఎస్ కార్యాలయానికి 11 ఎకరాల స్థలం కేటాయించుకున్నారని ఆరోపించారు. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే భూమిని ఉచితంగా తీసుకున్నారని మండిపడ్డారు. పేదలకు, జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వలేదని.. కానీ పార్టీ కార్యాలయాలకు మాత్రం రూ.కోట్ల విలువైన భూములు ఇచ్చుకున్నారని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు.
Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు'
Kishan Reddy on Tribal University : రాష్ట్ర ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీకి ( Tribal University) స్థలం కేటాయించకుండా తాత్సారం చేస్తూ.. గిరిజనుల పొట్ట కొడుతున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి స్థలం ఇవ్వకపోయినా త్వరగా పూర్తి చేయాలని కేంద్రం ఆలోచిస్తుందన్నారు. అబద్ధాలు ఆడటం.. ప్రజలను మభ్యపెట్టడంలో కల్వకుంట్ల కుటుంబం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందని విమర్శించారు. కృష్ణా నదీ జలాలు, పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీపై ఒకే రోజు కేబినెట్‌లో ఆమోదం పొందడం సంతోషకరమని కిషన్‌రెడ్డి తెలిపారు.
"కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సీఎం 10 ఎకరాల స్థలం ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యాలయానికి 11 ఎకరాల స్థలం కేటాయించుకున్నారు. ఎకరం రూ.100 కోట్లు విలువ చేసే భూమి ఉచితంగా తీసుకున్నారు. భూములు.. పేదలకు ఇవ్వలేదు, జర్నలిస్టులకు ఇవ్వలేదు. పార్టీ కార్యాలయాలకు మాత్రం రూ.కోట్ల విలువైన భూములు ఇచ్చుకున్నారు." - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు