ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషి గొప్పదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సేవా సప్తహ్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్లో దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులోభాగంగా రక్తదాన శిబిరాలు, శ్రమదానాలు, ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లండించారు. దేశంలో నూతన ఒరవడితో నూతన విధానాలతో మోదీ పాలన సాగుతోందని స్పష్టం చేశారు. గతంలో జమ్మూకాశ్మీర్లో అనేక అల్లర్లు, గొడవలు, కర్ఫ్యూ, యుద్ధవాతావరణం ఉండేదని విభజన అనంతరం శాంతిభద్రతలు నెలకొన్నాయని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లో శాంతి నెలకొల్పాం: కిషన్ రెడ్డి - Kishan reddy
ప్రధాని మోదీ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లో సేవా సప్తహ్ కార్యక్రమంను భాజపా నేతలు నిర్వహించారు. ఈ సమావేశాన్నికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరై దుస్తులను పంపిణీ చేశారు.
![జమ్మూకశ్మీర్లో శాంతి నెలకొల్పాం: కిషన్ రెడ్డి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4510614-318-4510614-1569063432847.jpg)
'జమ్మూ కశ్మీర్లో శాంతిని నెలకొల్పాం'