తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి : కిషన్​రెడ్డి - Union Minister Kishan Reddy Speech

హైదరాబాద్‌ నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి ప్రధాన కూడలి వద్ద వాహనదారులకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాస్కులు పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సికింద్రాబాద్‌ పరిధిలో 2 లక్షల మాస్కులు అందిస్తామని వెల్లడించారు.

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

By

Published : Dec 24, 2020, 7:35 PM IST

ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి: కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

కరోనా వైరస్‌ పట్ల ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌లో కొత్త వైరస్‌ వెలుగు చూసిన కారణంగా విమాన రాకపోకలు నియంత్రించినట్లు తెలిపారు.

హైదరాబాద్‌ నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి ప్రధాన కూడలి వద్ద వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో 2 లక్షల మాస్కులు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నామని.. రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేశామని వివరించారు.

ఇదీ చూడండి:క్రైస్తవులకు గవర్నర్​, సీఎం క్రిస్మస్​ శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details