kishan Reddy Comments on BRS and Congress : బీఆర్ఎస్ నేతలకు గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు లేదని.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీ నేతల తీరు గురివింద గింజ తీరుగా మారిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తే.. కేసీఆర్(kishan Reddy Comments on KCR) ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ఉల్టా చోర్ కొత్వాల్ డాటే అన్నట్లుగా.. ముఖ్యమంత్రి తీరుందని ఎద్దేవా చేశారు. సీఎం చేతిలో ఉన్న అన్ని విభాగాల ఛార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని కిషన్రెడ్డిమండిపడ్డారు.
కుటుంబ పాలన చేసే బీఆర్ఎస్.. కేంద్రంపై మాట్లాడటం హాస్యాస్పదమని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు ఏమైనా పర్వాలేదు కానీ.. మన కుటుంబం బాగుంటే చాలు అనుకునే పార్టీ భారత్ రాష్ట్ర సమితి (kishan Reddy Comments on BRS ) అని ధ్వజమెత్తారు. తెలంగాణలో భూములను ఇష్టానుసారంగా అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు భూములు ఇవ్వకుండా పంచుకున్నారని ఆరోపించారు. రోజువారీ ఖర్చులకూ భూములు అమ్ముతున్న పరిస్థితి ఉందని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 6 నెలల సమయం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మద్యం టెండర్లను పిలిచిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మరోవైపు బెల్ట్ షాపులు 24 గంటలు, 365 రోజులు ఉండేలా.. బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని విమర్శించారు. మద్యం ఆదాయం లేనిదే.. ఉద్యోగాలకు జీతాలివ్వలేని పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో మార్పు రావాలని.. అది బీజేపీతోనే సాధ్యమని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"వంట గ్యాస్, పెట్రోల్‌పై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఉందా..? కుటుంబపాలన చేసే బీఆర్ఎస్.. కేంద్రంపై మాట్లాడటం హాస్యాస్పదం. ప్రజలు ఏమైనా పర్వాలేదు.. మన కుటుంబం బాగుంటే చాలు అనుకునే పార్టీ భారత్ రాష్ట్ర సమితి. రాష్ట్రంలో మార్పు రావాలి.. అది బీజేపీతోనే సాధ్యం." - కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు