తెలంగాణ

telangana

ETV Bharat / state

Kishan Reddy On Modi 9 Years Development : 'మోదీ వచ్చాక.. అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతి​' - సబ్​ కా సాథ్​ సబ్​ కా వికాస్​

Beneficiaries Meeting in Hyderabad : కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు లబ్ధిదారులకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో.. తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటికే దేశ యువతకు ఎలాంటి గ్యారంటీ లేకుండా రూ.19 లక్షల కోట్లు రుణాలు ఇచ్చామని ఆయన తెలిపారు.

kishan reddy
kishan reddy

By

Published : Jun 30, 2023, 8:06 PM IST

Kishan Reddy Chief Guest At Beneficiaries Meeting in Hyderabad : నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం.. అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు. అందులో భాగంగానే ముద్ర యోజన ద్వారా దేశ ఔత్సాహిక యువతను మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. బంజారాహిల్స్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉత్తమ పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అనేక మంది యువత రుణాలు పొంది వారి వారి రంగాల్లో దేశ ఆర్థిక పురోభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని కిషన్​ రెడ్డి వివరించారు. ఎటువంటి గ్యారంటీ లేకుండా ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్’ అనే నినాదంతో సుమారుగా రూ.19 లక్షల కోట్ల వరకు ముద్ర రుణాలు ఇచ్చామన్నారు.

Mudra Loans For Youth Of Hyderabad : తద్వారా దేశ యువత సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించుకునేందుకు దోహదపడిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు. స్టార్టప్​ కంపెనీలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాల పట్ల ప్రజల అనుభూతి ఎలా తెలుసుకోవాలని ప్రధాని కోరిక మేరకు దేశవ్యాప్తంగా ఇలాంటి వర్క్​ షాప్​లు కండక్ట్​ చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

"లబ్ధిదారుల అనుభవాలను, వారికి ఎంత వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి కలుగుతుందనే దానిపై ఈ కార్యక్రమం జరిగింది. బ్యాంకులు లోన్​ ఇచ్చినప్పుడు ఏవైనా సమస్యలు ఉంటే తెలపాలి. అప్పుడే చర్యలు తీసుకోగలం. ఎలాంటి గ్యారెంటీలు లేకుండా రూ.19 లక్షల కోట్ల ముద్ర రుణాలను కేంద్రం ఇచ్చింది." -కిషన్​ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

దేశ యువతకు ఇప్పటి వరకు గ్యారంటీ లేకుండా.. రూ.19 లక్షల కోట్లు లోన్

Sab Ka Sath Sab Ka Vikas : లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకోవడం కోసమే.. ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కిషన్​ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వానికి, లబ్ధిదారునికి మధ్య వారధిగా పని చేస్తుందని విశ్వసించారు. లోన్​లు ఇచ్చినప్పుడు ఏవైనా లోటుపాట్లు ఉండి.. ఫిర్యాదు చేయాలనుకుంటే కచ్చితంగా ప్రధాని మోదీకి, తమకైనా లేఖ రాస్తే సరిపోతుందన్నారు. ఆ సమస్యలను త్వరిత గతిన తీర్చడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని లబ్ధిదారులకు.. కిషన్​ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ రంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా బ్యాంకుల సహాయంతో వివిధ పథకాల ద్వారా లోన్స్ పొంది పెద్ద పెద్ద ఎంటర్ ప్రెన్యూర్సుగా ఎదుగుతున్న.. వారి వారి అనుభవాల్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details