Kishan Reddy about Krishna Water Sharing at Telangana and AP : కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని తెలంగాణ కోరుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. కృష్ణా జలాల (Krishna Water) పంపిణీపై కేంద్రం, తెలంగాణ మధ్య చర్చలు జరిగాయని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనే తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. జల వివాదాలు పరిష్కరించిన కేంద్ర ప్రభుత్వానికి దిల్లీలో కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత ట్రైబ్యునల్‌కు (Tribunal) ప్రత్యామ్నాయం ఏర్పాటుపై చర్చ జరిగిందని వివరించారు.
'కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 34 శాతం, ఏపీకి 66'
Krishna Water Sharing : ఈ క్రమంలో 2021లో రిట్ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కరించాలని రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయని చెప్పారు. రెండు రాష్ట్రాలతో కేంద్రం అనేకసార్లు మాట్లాడిందని గుర్తు చేశారు. సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుందని అన్నారు. సొలిసిటర్ జనరల్ 2023 జులైలో న్యాయశాఖకు నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. ట్రైబ్యునల్‌లో అదనపు నిబంధనలు చేర్చాలని నిర్ణయించారని కిషన్‌రెడ్డి వెల్లడించారు.
Union Cabinet Orders to Krishna Water Dispute Tribunal :సెక్షన్ 12కు అదనపు నిబంధనలు చేర్చి సమస్య పరిష్కరించుకోవచ్చని సూచించారని కిషన్‌రెడ్డి వివరించారు. ఈ సెక్షన్‌కు అదనపు నిబంధనలు చేర్చి సమస్య పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించిదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సమస్య పరిష్కారమవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రధానికి తెలుగు రాష్ట్రాల తరఫున ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో కేంద్రం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు.
Telangana Govt Letter to KRMB Chairman : 'గతేడాది ఏపీ ఎక్కువగా వాడుకున్న జలాలను ఈ ఏడాది జమ చేయాలి'