తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోడుభూముల విషయంలో ఆదివాసీల హక్కులు కాలరాస్తున్నారు' - కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వార్తలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోడు భూముల విషయంలో మాటమారుస్తూ ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి (Kishan Congress National Vice President ) ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో కేంద్రమాజీ మంత్రి బలరామ్‌నాయక్​తో కలిసి పోడు భూముల విషయంలో మీడియాతో మాట్లాడారు.

kodamdareddy
kodamdareddy

By

Published : Oct 25, 2021, 4:11 PM IST

పోడు భూముల విషయంలో చట్టం ఉన్నప్పటికీ... సీఎం కేసీఆర్​ విస్మరిస్తున్నారని కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి (Kishan Congress National Vice President ) ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పోడుభూములపై కోనేరు రంగారావు కమిటీని వేయగా... కమిటీ నివేదిక అన్ని రకాల భూములకు మార్గదర్శకాలు రూపొందించిందని కోదండరెడ్డి తెలిపారు. కోనేరు సిఫారసులను అమలు చేయడానికి అప్పటి మంత్రుల కేబినేట్‌లో ఉన్న తెరాస మంత్రులు కూడా కోనేరు కమిటీ సిఫారసులను ఆమోదం తెలిపారని గుర్తు చేశారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం పోడు భూముల విషయంలో అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా హామీ ఇచ్చారన్నారు. భూములను వదలిపెట్టకుంటే రైతుబంధు కూడా రాదని సీఎం బెదిరిస్తున్నారని నేతలు మండిపడ్డారు. సీఎం ధోరణిని చూస్తుంటే తెలంగాణలో మళ్లీ ఫ్యూడల్‌వ్యవస్థ పునరుద్ధరణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కాంగ్రెస్ భావిస్తుందని కేంద్ర మాజీ మంత్రి బలరామ్‌ నాయక్‌ తెలిపారు. కాంగ్రెస్ ఎప్పుడూ ఆదివాసీల వెంటే ఉంటుందన్నారు.

ఇదీ చూడండి:'24 గంటల్లోగా పీఆర్సీ ఇవ్వకపోతే... మంచినీటి సరఫరా నిలివేస్తాం'

ABOUT THE AUTHOR

...view details