తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారిక గ్రూప్​లో అశ్లీల వీడియో.. వివాదంలో ఎంపీడీఓ

కీసర మండల ఎంపీడీఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ అశ్లీల వీడియోను అధికారిక వాట్సాప్​లో పోస్ట్​ చేశారు. దీనిపై గ్రూప్​ సభ్యులు ఎంపీడీఓపై మండిపడుతున్నారు.

Kisara MPDO Pornographic video posted in  official WhatsApp
వివాదంలో ఎంపీడీఓ.. అధికారిక గ్రూప్​లో అశ్లీల వీడియో పోస్ట్​

By

Published : Jul 15, 2020, 1:41 PM IST

Updated : Jul 15, 2020, 1:59 PM IST

మేడ్చల్​ జిల్లా కీసర మండల ఎంపీడీఓ వివాదంలో ఇరుక్కున్నారు. సామాజిక మాధ్యమంలో అశ్లీల వీడియో పోస్ట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. ఆ వీడియోను అధికారిక గ్రూప్​లో ఎంపీడీఓ పోస్ట్​ చేశారు. ఒకవైపు కీరస మండలంలో కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతూ.. ఉన్నాయి. మరోవైపు హరితహారం కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. కరోనా కట్టడిపై పనిచేయాల్సిన కీసర మండలం ఎంపీడీఓ మండలానికి సంబంధించిన అధికారులతో ఉన్నటు వంటి వాట్సాప్​ గ్రూప్​లో ఓ అశ్లీల వీడియోను పోస్ట్​ చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రూపు సభ్యులు.

Last Updated : Jul 15, 2020, 1:59 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details