'భూములు లాక్కుంటే రైతులెక్కడికి వెళ్లాలి' - kisan congress state president anvesh reddy
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం పరిధిలో దాదాపు 60 ఏళ్ల నుంచి సాగుచేస్తున్న రైతుల భూములను కేసీఆర్ ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి ఆరోపించారు.

'భూములు లాక్కుంటే వారు ఎక్కడికి వెళ్లాలి'
'భూములు లాక్కుంటే వారు ఎక్కడికి వెళ్లాలి'
రాచకొండ ప్రాంతం రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్ రెడ్డి స్పష్టం చేశారు. సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని 15 వేల ఎకరాల సాగుభూమిని కేసీఆర్ ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 60 ఏళ్లుగా సాగు చేస్తున్న వారి భూములకు పట్టాలు ఇవ్వకుండా అటవీ అధికారులు రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వారికి జీవనాధారమైన భూములను లాక్కుంటే వారంతా ఎక్కడికి పోవాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్వేశ్ డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి : జంటనగరాల్లో భారీవర్షం... ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం