తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmer Suicide: ‘వేములఘాట్​ రైతు మల్లారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి’

వేములఘాట్​లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోదండరెడ్డి డిమాండ్​ చేశారు. పరిహారం ఇవ్వకపోవడం వల్లే మల్లారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడని అన్నారు.

kisan congress president kodandareddy demands for justice to farmer mallareddy who committed suicide in vemulaghat
‘వేములఘాట్ రైతు మల్లారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి’

By

Published : Jun 19, 2021, 1:21 PM IST

రైతులు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, కేసీఆర్‌ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విజ్ఞప్తి చేశారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన వేములఘాట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన మల్లారెడ్డి రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. గజ్వేల్‌ జిల్లా వేటూరు గ్రామంలో దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. అక్రమంగా భూమి లాక్కొని వేధించడం వల్లే వేముల ఘాట్‌లో మల్లారెడ్డి ఆత్యహత్య చేసుకున్నట్లు వివరించారు.

భూమిని బలవంతంగా లాక్కున్నారని, తన చావుకు వేధింపులే కారణమని మల్లారెడ్డి మరణవాగ్మూలంలో పేర్కొన్నాడని అన్నారు. న్యాయస్థానం సంబంధిత అధికారులపై కేసులు పెడితే వాళ్లను కాపాడుకోడానికి 59 కోట్ల ఖర్చులకు జీవో ఇచ్చారని ఆరోపించారు. మల్లన్నసాగర్‌ జలాశయంలో భూములు కోల్పోయే రైతు కుటుంబాలకు ఆర్​ అండ్ ​ఆర్‌ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.

ఇదీ చూడండి:పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details