తెలంగాణ

telangana

ETV Bharat / state

పోస్టుకార్డు ఉద్యమానికి కిసాన్ కాంగ్రెస్ శ్రీకారం - Kisan Congress latest updates

భూరికార్డుల ప్రక్షాళన జరిగినా లక్షలాది రైతులకు పాస్ పుస్తకాలు రాలేదని ఆరోపించారు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి. ఇవాళ్టి నుంచి కిసాన్ కాంగ్రెస్ పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభం అవుతుందని తెలిపారు.

Kisan Congress postcards movement fromfrom today
ఇవాళ్టి నుంచి కిసాన్ కాంగ్రెస్ పోస్టు కార్డుల ఉద్యమం

By

Published : Jul 5, 2020, 10:31 AM IST

నేటి నుంచి కిసాన్ కాంగ్రెస్ పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించినట్టు ఏఐసీసీ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం పోస్టు కార్డుల ఉద్యమం చేపడుతున్నట్లు వివరించారు.

భూరికార్డుల ప్రక్షాళన జరిగినా లక్షలాది రైతులకు పాస్ పుస్తకాలు రాలేదని ఆయన ఆరోపించారు. పట్టాదారు పాసు పుస్తకం లేక ప్రభుత్వ పథకాలు, రుణాలు రావట్లేదని పేర్కొన్నారు. పాసు పుస్తకాలు అందని రైతుల ద్వారా పోస్టు కార్డుల ఉద్యమం మొదలుపెడుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details