ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రిత సాగు విషయంలో మొండిగా వ్యవహారించి.. ఇప్పుడేమో ఆ పద్ధతిని ఎత్తేస్తాం.. కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామంటున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మండిపడ్డారు. రైతుల విషయంలో ప్రభుత్వం ఇలా మాట్లాడటం బాధాకరమని ఆక్షేపించారు. కేంద్రం తెచ్చిన 3 చట్టాలను ముందు వ్యతిరేకించిన సీఎం కేసీఆర్.. దిల్లీకి వెళ్లాక కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామంటున్నారని దుయ్యబట్టారు.
'సీఎం కేసీఆర్ రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి' - hyderabad district latest news
రైతుల పట్ల ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ఆరోపించారు. పట్టుబట్టి రైతులతో నియంత్రిత సాగు విధానంలో పంటలు సాగు చేయించిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ విధానాన్ని ఎత్తేస్తామనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలను తొలగిస్తామనడం సరికాదని అన్నారు.
'సీఎం కేసీఆర్ రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి'
రైతులకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ప్రకృతి వైపరీత్యాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని కోదండరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇంకా సుమారు 12 లక్షల మందికి పాసుపుస్తకాలు అందలేదని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.