తెలంగాణ

telangana

ETV Bharat / state

Kisan congress: ప్రభుత్వ భూముల వేలం ఆపండి..సీఎస్​కు కాంగ్రెస్ లేఖ - కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి తాజా వార్తలు

కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ్‌ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డిలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్​కు లేఖ రాశారు. ప్రభుత్వ భూముల వేలాన్ని ఆపాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

సీఎస్ సోమేష్
సీఎస్ సోమేష్ కుమార్కు కిసాన్ కాంగ్రెస్ లేఖ

By

Published : Jun 14, 2021, 5:05 PM IST

తెలంగాణాలో ప్రభుత్వ భూములను వేలం వేయాలన్న రహస్య అజెండాతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం భూముల వేలాన్ని ఆపాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డితో కలిసి ఆయన లేఖ రాశారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా భూములను వేలం వేస్తుంటే తాము అడ్డుకున్నామని పేర్కొన్నారు. ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రజల ఆస్తులను అమ్మారని చెప్తూ... ఆనాడు కేసీఆర్ ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజా అవసరాల కోసం రైతుల నుంచి సేకరించిన భూములను ఈ అవసరాలకే ఉపయోగించాల్సి ఉంటుందని కోదండ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకం నిర్ణయాన్ని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి:Petrol Price: హైదరాబాద్​లోనూ సెంచరీ దాటిన పెట్రోల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details