కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని... శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ, పంటబీమా చెల్లించాలని కోరారు. రైతుల డిమాండ్లను నెరవేర్చాలంటూ హైదరాబాద్ అబిడ్స్‌లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలి: రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ - రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ అన్వేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్లను నెరవేర్చాలంటూ హైదరాబాద్ అబిడ్స్‌లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్వేశ్ రెడ్డి ఆరోపించారు. పంటలు అమ్ముకునేందుకు ఏర్పాటైన కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడిప్పడే పంటలు చేతికొస్తున్నందున తక్షణమే రాష్ట్రప్రభుత్వం ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుల డిమాండ్లపై ఎన్ని సార్లు వినతి పత్రాలిచ్చినా పట్టించకోవడం లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రేపు అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాను భగ్నం చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు.