హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డుని నమోదు చేసింది. వెయ్యి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను దిగ్విజయంగా పూర్తిచేసింది. కిమ్స్ వైద్యుడు , కిడ్నీ మార్పిడీ విభాగం అధిపతి డాక్టర్ సర్బేశ్వర్ సహారియా వెయ్యి కిడ్నీల మార్పిడిని విజయవంతం చేసినందున ఆయనను సన్మానించారు.
కిడ్నీ మార్పిడిలో కిమ్స్ రికార్డు - kims hospitals india
కిమ్స్ ఆసుపత్రి ఘనత సాధించింది. వెయ్యి కిడ్నీ మార్పిడిల ద్వారా అరుదైన రికార్డును నమోదు చేసింది.
![కిడ్నీ మార్పిడిలో కిమ్స్ రికార్డు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3836735-1062-3836735-1563103057417.jpg)
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర రావు, నిమ్స్ వైద్యుడు డాక్టర్ శ్రీభూషణ్ రాజు, కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ విక్రాంత్ రెడ్డి , జీవన్‌దాన్ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. డాక్టర్ సహారియా ఇప్పటి వరకు సుమారు 3000కుపైగా కిడ్నీ శస్త్రచికిత్సలను పూర్తి చేశారు. డాక్టర్ సహారియా... కిమ్స్ లో దిగ్విజయంగా వెయ్యి కిడ్నీల మార్పిడీ శస్త్రచికిత్సలు పూర్తి చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందులో సుమారు 200వరకు కెడవర్ ట్రాన్స్ ప్లాంట్స్ కావటం విశేషమని సహారియా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అంగరంగ వైభవంగా బల్కంపేట అమ్మవారి కల్యాణం